చెప్పులు మోయడానికి… తీసివ్వడానికి తేడా తెలియని మూర్ఖుడు కేసీఆర్ – బండి సంజయ్

-

చెప్పులు మోయడానికి… తీసివ్వడానికి తేడా తెలియని మూర్ఖుడు కేసీఆర్ అని కౌంటర్‌ ఇచ్చారు బండి సంజయ్. నిన్న పెద్దపల్లి బహిరంగ సభలో అమిత్‌ షా చెప్పులు మోసాడని బండి సంజయ్ పై కేసీఆర్‌ సెటైర్లు వేశారు. అయితే.. దానికి బండి సంజయ్‌ కౌంటర్‌ ఇచ్చారు. కేసీఆర్… నువ్వే పెద్ద గజదొంగవు… తెలంగాణను సైబర్ నేరాల్లో, మానవ అక్రమ రవాణాలో నెంబర్ వన్ గా మార్చింది మీరేనని ఫైర్‌ అయ్యారు.

ఆర్దిక నేరాల్లో నెంబర్ 2, వ్రుద్దులపై దాడుల్లో నెంబర్ 3, రైతుల ఆత్మహత్యల్లో నెంబర్ 4గా మార్చింది మీరేనని.. వాయి వరసల్లేని నీచమైన కుటుంబం మీదేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని కుట్ర చేస్తున్నది మీరే… మీ పార్టీకే ప్రజలు మీటర్ పెట్టబోతున్నారని హెచ్చరించారు.

సింగరేణిని దివాళా తీయించి బొందలగడ్డగా మార్చింది మీరేనని.. ఏ తప్పూ చేయకపోతే కాళేశ్వరం సందర్శనకు అనుమతివ్వాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్ కు దమ్ముంటే అభివ్రుద్ధిపై చర్చకు సిద్దం కావాలని.. ప్రధానమంత్రి నరేంద్రమోదీపైన, బీజేపీపైన విమర్శలు చేయడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో రాజకీయ గురువు ప్రొఫెసర్ జయశంకర్ ను కాలితో తన్ని అవమానించిన ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పులు మోయడానికి… చెప్పులు తీసివ్వడానికి మధ్య తేడా తెలియని మూర్ఖుడని ఆగ్రహించారు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Latest news