అన్నదాతలకు అలర్ట్… 12వ ఇన్‌స్టాల్‌మెంట్ ని పొందాలంటే ఇలా చెయ్యాల్సిందే…!

-

అన్నదాతలకి గుడ్ న్యూస్. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యొక్క 12వ ఇన్‌స్టాల్‌మెంట్ ఇక త్వరలో విడుదల కానుంది. విడుదల అయ్యాక రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయి. అయితే ఈ డబ్బులు జమ అవ్వాలంటే రైతులు తప్పనిసరిగా కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయాలి.

farmers

మొదట దీని గడువు జూలై 31 వరకు వుంది. కానీ మరో అవకాశం ఇవ్వాలని ఆ గడువుని ఎక్స్టెండ్ చేసారు. ఇకేవైసీ ప్రాసెస్ పూర్తి చేయని రైతులకు ఇది మంచి అవకాశం. కేంద్ర ప్రభుత్వం 2022 ఆగస్ట్ 31 వరకు ఈ గడువుని పెంచింది. కనుక రేపటి లోగా పూర్తి చేసుకోండి. లేకపోతే ఇబ్బంది పడాలి.

పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు పొందాలంటే ఈ ప్రక్రియ ముఖ్యం. ఈజీగా అన్నదాతలు పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ప్రక్రియ ని పూర్తి చేసేయచ్చు. దగ్గర వుండే సీఎస్‌సీ సెంటర్లకు వెళ్లి బయోమెట్రిక్ బేస్డ్ ఇకైవైసీ ప్రాసెస్ ని పూర్తి చేసుకోచ్చు. పోర్టల్ లో చేసుకోవాలంటే ఇలా చెయ్యండి.

ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ లోకి వెళ్ళండి.
నెక్స్ట్ హోమ్ పేజీలో eKYC ఆప్షన్ క్లిక్ చెయ్యండి.
ఆధార్ కార్డ్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చెయ్యండి.
ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్ నొక్కండి.
Get OTP ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
ఓటీపీ ఎంటర్ చేయాలి.
ఇ-కేవైసీ ప్రాసెస్ పూర్తి అవుతుంది అంతే.

 

Read more RELATED
Recommended to you

Latest news