పదవ తరగతి హింది ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రంగనాథ్ పై పరువు నష్టం దావా వేసేందుకు బండి సంజయ్ సిద్ధమవుతున్నారు. పదవ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో నిరాధార ఆరోపణలపై సంజయ్ కోర్టుకి వెళ్ళనున్నారు. హక్కుల భంగం తో పాటు ఇతర విషయాలపై పార్లమెంట్ ప్రీవిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
సిపి రంగనాథ్ పై వచ్చిన ఆరోపణలను వెలికి తీస్తానని బండి సంజయ్ ప్రకటించారు. ఇక తన రిమాండ్ రద్దు చేయాలని బండి దాఖలు చేసిన పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. విచారణకు బండి సంజయ్ సహకరించట్లేదని.. తన ఫోన్ ను పోలీసులకు ఇవ్వడం లేదని, ఆయన బెయిల్ ని రద్దు చేయాలని ఏజీ కోర్టుని కోరారు. దీంతో కోర్టు తదుపరి విచారనను ఈనెల 21కి వాయిదా వేసింది.