ఇండియాలో పెట్టుబడులు పెట్టండి..అమెరికాలో బండి సంజయ్‌ ప్రసంగం

-

ఇండియాలో పెట్టుబడులు పెట్టండని…అమెరికాలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ ప్రసంగించారు. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీపట్ల ప్రవాస భారతీయులు చూపుతున్న అభిమానంపట్ల బండి సంజయ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. మోదీపై చూపుతున్న అభిమానాన్ని ఓట్ల రూపంలో కురిపించాలని కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న బండి సంజయ్ భారత కాలమానం ప్రకారం నిన్న మధ్యాహ్నం అట్లాంటాలో ప్రవాస భారతీయుల (ఇండియన్ కమ్యూనిటీ )తో సమావేశమయ్యారు.

bandi sanjay in america
bandi sanjay in america

ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ ‘‘మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. మోదీగారిపై మీరు చూపుతున్న అభిమానం వెలకట్టలేనిది. మోదీగారి 9 ఏళ్ల పాలన అవినీతికి తావు లేకుండా కొనసాగుతోంది. అభివ్రుద్ధిలో భారత్ ప్రపంచ దేశాల్లో నెంబర్ వన్ గా నిలవాలంటే మళ్లీ మోదీ ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉంది. అందుకోసం మీరంతా సమయం తీసుకుని ఎన్నికల సమయంలో భారత్ రండి. మోదీగారి తరపున ప్రచారం చేయడంతోపాటు ఓట్లు వేయాలి‘‘అని కోరారు. మోదీ పాలనలో భారత్ శరవేగంగా అభివ్రుద్ధి చెందుతోందని, భారత్ లో పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా ఎన్నారైలను బండి సంజయ్ కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news