సర్పంచులతో కలిసి సర్కారుపై పోరు చేయనున్న బండి సంజయ్

-

కొన్ని రోజుల నుంచి తెలంగాణ సర్కారుపై విజృంభిస్తున్న బండి సంజయ్.. ఇప్పుడు సర్పంచ్ లతో కలిసి సమరభేరీ కి సిద్ధమవుతున్నారు. జూన్ తొలివారంలో వారితో కలసి మౌనదీక్షకు శ్రీకారం చుడుతున్నారు. హైదరాబాద్ లంగర్ హౌస్ లోని బాపుఘాట్ వేదికగా సర్పంచ్ లతో కలిసి నల్లబ్యాడ్జీలు ధరించి రెండు గంటల పాటు మౌన దీక్ష చేపట్టనున్నారు. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా, ఇంకా ఆలస్యం చేస్తుండడంతో.. బిల్లులు ఇచ్చే దాకా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన ఈ దీక్షకు పూనుకున్నారు.

అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి ఆధ్వర్యంలో ఈ అంశంపై నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు బండి సంజయ్ కార్యాచరణ రూపొందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల నిధులు ఇస్తోందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ ఆ నిధుల్ని రాష్ట్రప్రభుత్వం దారి మళ్లిస్తుందని వారు ఆరోపిస్తున్నారు. ఒకవైపు పంచాయతీలకు నిధులు ఇస్తున్నట్లు ఉత్తర్వులు ఇస్తూనే.. మరోవైపు ఆ నిధులను ఫ్రీజ్ చేస్తూ సర్పంచులను మానసిక క్షోభకు గురి చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news