హనుమంతుడి జన్మస్థలం విషయంపై తెరపైకి మరో కొత్త అంశం

-

హనుమంతుడి జన్మస్థలం విషయంపై మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. తిరుమల తిరుపతి లోని ఏడు కొండల లో ఒకటైన అంజనాద్రే హనుమంతుని జన్మస్థలం అంటూ గతంలో టీటీడీ ఆస్థాన పండితులు వాదించగా.. కర్ణాటకలోని కిష్కింద ఆంజనేయుడి జన్మస్థలం అంటూ అక్కడి పండితులు వాదించారు. అయితే ఈ వాదనల పర్వం ఓ కొలిక్కి రాకుండానే హనుమంతుడి జన్మ స్థలం విషయంలో మరో కొత్త వాదన తెరపైకి వచ్చింది.

గతంలో భావించినట్లుగా హనుమంతుడు అటు అంజనాద్రి లోనూ, ఇటు కిష్కింద లోను జన్మించ లేదని.. మహారాష్ట్రలోని ఆంజనేరి పర్వతాల్లో జన్మించారని మరో వాదన ప్రస్తుతం తెరపైకి వచ్చింది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి, శ్రీ మండలాచార్య మహంత్ పీఠాధిపతి స్వామి అనికేత్ శాస్త్రి దేశ్ పాండే మహారాజ్ మే 31న నాసిక్ లో ధర్మ సంసద్ ను ఏర్పాటు చేశారు. ఈ సంసద్ లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న సాధువులు తరలివచ్చి హనుమంతుడి జన్మ స్థలం పై తమ అభిప్రాయాలను తెలియజేస్తారని స్వామి అనికేత్ తెలిపారు. దీని తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందరూ అంగీకరించాల్సిందే అని కూడా పీఠాధిపతులు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news