నిన్న అర్థరాత్రి జరిగిన రేవ్ పార్టీ తెలుగు రాష్ట్ర రాజకీయాలను కుదేపిస్తోంది. అయితే.. ఈ సంఘటనలో మరో బిగ్ ట్విస్టు చోటు చేసుకుంది. ఈ డ్రగ్స్ కేసు లో అధికారులపై వేటు వేశారు ఉన్నతాధికారులు. ముఖ్యంగా బంజారాహిల్స్ సీఐ శివ చంద్ర ను సస్పెండ్ చేశారు అధికారులు. అలాగే.. బంజారాహిల్స్ ఏసీపీ సుందర్శన్ కు ఛార్జ్ మెమో కూడా జారీ చేశారు ఉన్నతాధికారులు.
కాగా.. హైదరాబాద్ మహానగరంలోని పబ్ లపై నిన్న రాత్రి పోలీసులు వరుసగా దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే.. నిన్న నగరంలో నిర్వహించిన రేవ్ పార్టీని కూడా పోలీసులు భగ్నం చేసినట్లు తెలుస్తోంది. రాడిసన్ బ్లూ హోటల్ పై టాస్క్ ఫోర్స్ అధికారులు ఒక్క సారిగా దాడులు చేశారు. రాత్రి 3 గంటల సమయంలో దాడులు నిర్వహించిన పోలీసులు… వారిని అరెస్టు చేశారు. అయితే పోలీసుల అదుపులోకి టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో పాటు మెగా డాటర్ నిహారిక కూడా ఉన్నారు. అలాగే.. నిర్వాహకులు అభిషేక్ ఉప్పల్, అనిల్ కుమార్ లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.