బాసర ట్రిపుల్ ఐటీ ఫుడ్ పాయిజన్ పై కేసు నమోదు

-

నిర్మల్ : బాసర ట్రిపుల్ ఐటీ ఫుడ్ పాయిజన్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. సెక్షన్ 273,336,ipc59/3 ఫుడ్ సేఫ్టీ ఆఫ్ స్టాండర్డ్ యాక్టు 2006 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఎస్ ఎస్ క్యాటర్స్, కేంద్రీయ బండార్ అనే రెండు మెస్ ల పై కేసు నమోదు చేశారు పోలీసులు. స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ రంజిత్ కుమార్ పిర్యాదు తో కేసు నమోదు చేసారు బాసర పోలీసులు.

ఫుడ్ పాయిజన్ కు రియూజ్ ఆయిల్, కుళ్ళిన కోడి గుడ్లు, క్వాలిటీ లేని కారం పొడి తో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసినట్టు ఆరోపిస్తున్నారు విద్యార్థులు. ఇప్పటికే మేస్ ల వద్ద నుంచి శాంపిల్స్ సేకరించిన అధికారులు… దర్యాప్తు చేస్తున్నారు.

కాగా బాసర త్రిపుల్ ఐటీ లోశుక్రవారం రాత్రి భోజనం చేసిన వందలాది విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. కడుపు నొప్పి అలాగే వాంతులతో ఏకంగా 600 మంది అస్వస్థలయ్యారు. యూనివర్సిటీ మెయిన్ లో శుక్రవారం రాత్రి 3000 మంది విద్యార్థులు భోజనం చేశారు. ఆ తర్వాత హాస్టల్ కి వెళ్ళిన వీరిలో ఒక్కొక్కరుగా ఇబ్బందిని ఎదుర్కొన్నారు. దీంతో అధ్యాపకులు తమ కార్లలో యూనివర్సిటీలోని ఆసుపత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news