రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి.: బట్టి విక్రమార్క

-

రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క విమర్శించారు. ఖమ్మం జిల్లా వైరాలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ రైతులకు రుణమాఫీ చేయలేదని… గిట్టుబాటు ధర లేక పెట్టిన పెట్టుబడి రాక అప్పులు తీరక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. రైతుల పరిస్థితులను గమనించే రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ ప్రకటించారని.. అధికారంలోకి వచ్చిన తరువాత రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు. గిట్టుబాటు ధర ఇచ్చి పెట్టుబడికి రూ. 15 వేలు ఎకరాకు అందిస్తామని వెల్లడించారు. వడ్డీ లేని రుణాలు ఇస్తామని… అసలు భూమి లేని వారికి ఉపాధి హామీ పథకం నమోదు చేసుకున్న వారికి ఆర్థిక సహాయం చేస్తామని అన్నారు. ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్ర, రాష్ట్రాలు మోసం చేస్తున్నాయని అన్నారు. విత్తన చట్టం తీసుకువచ్చి నకిలీ విత్తనాలు నిర్మూలన చేస్తాం… రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని అన్నారు. దళిత బందు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధరణి పోర్టల్ ని మారుస్తామని అన్నారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news