Telangana : సెప్టెంబరు 15లోగా బతుకమ్మ చీరల ఉత్పత్తి

-

తెలంగాణ ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ చేస్తుంది. ఈ ఏడాది కూడా ఈ ఆనవాయితీ కొనసాగనుంది. బతుకమ్మ చీరల ఉత్పత్తి లక్ష్యం ఖరారైంది. సెప్టెంబరు 15 లోగా చీరల తయారీ పూర్తి చేయాలని అధికారులు నేతన్నలకు నిర్దేశించారు.

చీరలు, జాకెట్ల కోసం ఏడు కోట్ల మీటర్ల వస్త్రం తయారుచేయించాలని నిర్ణయించారు. తొలి విడతగా 5.54 కోట్ల మీటర్ల చీరల వస్త్రం బాధ్యతను సిరిసిల్లకు అప్పగించారు. అలాగే 68 లక్షల మీటర్ల జాకెట్‌ వస్త్రం తయారీ ఆర్డర్‌ను టెక్స్‌టైల్‌ పార్కుకు ఇచ్చారు. ఈ ఆర్డర్లను మ్యూచువల్‌ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ సొసైటీ (మ్యాక్స్‌), ఎస్‌ఎస్‌ఐ యూనిట్ల వారీగా కేటాయించేందుకు జిల్లా చేనేత, జౌళి శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఏటా రాష్ట్ర చేనేత సహకార సంస్థ ఆర్డర్లు ఇవ్వగా ఈసారి తెలంగాణ పవర్‌లూం, టెక్స్‌టైల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీపీటీడీసీఎల్‌) నుంచి ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news