రేపు ప్రియాంక యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తారు: భట్టి విక్రమార్క

-

రేపు ప్రియాంక యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తారన్నారు భట్టి విక్రమార్క. దశాబ్దాల చిరకాల వాంఛ తెలంగాణ రాష్ట్రంను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే.. మా ఉద్యోగాలు వస్తాయనుకుంటే దశాబ్ద కాలంగా మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

 

ఒక్కగానొక్క నోటిఫికేషన్ వేస్తే.. పేపర్ లీకేజ్‌తో మోసం చేశారు. నిరుద్యోగులకు భరోసా కల్పించడం కోసం రేపు సభ నిర్వహిస్తున్నాం. ప్రియాంక గాంధీ రేపు యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తారు. ఈ డిక్లరేషన్‌ను నూటికి నూరుపాళ్లు అమలు చేస్తామని ప్రకటించారు భట్టి విక్రమార్క.

కాగా, కాంగ్రెస్ పార్టీ  ముఖ్య నేత ప్రియాంక గాంధీ రేపు హైదరాబాద్ కు రానున్నారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగించుకొని సరూర్ నగర్ లో యువ సంఘర్షణ సభకు హాజరు కానున్నారు. ప్రియాంక తొలిసారి తెలంగాణకు వస్తుండటం తో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రియాంక కేవలం గంటన్నర మాత్రమే పర్యటిస్తారని, సభలో యువ డిక్లరేషన్ ప్రకటిస్తారని నేతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news