సివిల్స్ లో ప్రిలిమ్స్ పాసై ఫైనల్స్ కు హాజరవుతున్న 135 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున ఉప ముఖ్యమంత్రి బట్టి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ చేసారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో, సింగరేణి సి.ఎస్.ఆర్ నిధులతో సివిల్స్ అభ్యర్థులకు సహాయం చేసారు. ఈ క్రమంలో మన రాష్ట్రం నుండి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఎక్కువ మంది ఎంపిక అవ్వాలి అని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. వాళ్లకు ఆర్థిక ఇబ్బంది కొంతైనా తగ్గించాలనే లక్ష రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. లక్ష పెద్ద నగదు కాకపోయినా.. కొంతైనా ఉపశమనం కలగాలని మా ప్రయత్నం అని భట్టి పేర్కొన్నారు.
అలాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఓపెన్ చేస్తున్నాం. ఐదు వేల కోట్లు మౌలిక వసతుల కోసం ఖర్చు చేయబోతున్నాం. గత ప్రభుత్వం 3 వేల కోట్లు ఖర్చు చేస్తే.. మేము ఐదు వేల కోట్లు పెడుతున్నాం. విద్యకు అంత ప్రాధాన్యత ఇస్తున్నాం. స్కిల్ యూనివర్సిటీ తో యువతకు ఉపాధి కల్పన కోసం కృషి చేస్తున్నం అని భట్టి అన్నారు.