రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమం లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేశాం.. ఇంకో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం.. ఉద్యోగ నియామకాల కోసం చిత్తశుద్ధి తో పని చేస్తున్నాం అని అన్నారు. సివిల్స్ విద్యార్థులకు ఆత్మస్థైర్యం ఇవ్వడం కోసం మా ప్రయత్నం. కొందరికి లక్ష చిన్నది కావచ్చు.. కొందరికి లక్ష ఎక్కువ కావచ్చు. కానీ మేము మీకు అండగా ఉన్నాం అని చెప్పడం కోసం మా ఆలోచన. మీరు మా కుటుంబ సభ్యులు అని చెప్పే ప్రయత్నం మాది.
చాలా కాలం మనకు సచివాలయం లేదు. సచివాలయం వచ్చాకా.. ఎవరికి అనుమతి లేదు అలాంటి పరిస్థితి నుండి ఇది ప్రజలది అని నమ్మకం కలిగించే ప్రయత్నం చేశాం. అందుకే మిమ్మల్ని కూడా ఇక్కడికే రప్పించాము. ఇంటర్వ్యూలలో కూడా ఐఏఎస్ కి సెలక్ట్ అవ్వాలి. మన పిల్లలు ఎందుకు ఐఏఎస్ లుగా ఎంపిక కాకూడదు అని మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మీరు ఇప్పుడు పరీక్షల మీద దృష్టి పెట్టండి అని సివిల్స్ లో ప్రిలిమ్స్ పాసైన వారికి సీఎం సూచనలు చేసారు.