తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో భారీ అంకెలు కనిపించాయి కానీ కొత్తేమి లేదన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. గత సంవత్సరం బడ్జెట్ లెక్కలు సంక్షేమం ఇప్పటికీ అమలు చేయడం లేదన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు, మోసం చేసేందుకు భారీ లెక్కలు చూపించారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల లెక్కలు బడ్జెట్ లో లెక్కలు చూపించలేదన్నారు. రుణమాఫీకి నిదులు కేటాయించలేదని.. 24 గంటల కరెంట్ అబద్ధమని దుయ్యబట్టారు.
బిసిలకు 6వేల కోట్లు మాత్రామే బడ్జెట్ కేటాయించారని అన్నారు. 8 ఏళ్లుగా ఎస్సి, ఎస్టీ సబ్ ప్లాన్ నిదులు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. రుణమాఫీ సరిగ్గా చేయకపోవడంతో 16లక్షల మంది రైతుల అకౌంట్స్ NPA గా మిలిగిపోయాయన్నారు. ఇక నిరుద్యోగ భృతి, గిరిజనబంధు ఊసే లేదన్నారు. లిక్కర్ ఆదాయం బడ్జెట్ లో బాగా కనిపించిందని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఉపయోగపడే నిదులు, నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవం అనే నాలుగు సూత్రాలు బడ్జెట్ లో కనిపించలేదన్నారు.