బీఆర్ఎస్ కు దిమ్మతిరిగేలా త్వరలో మరో రెండు గ్యారెంటీల అమలు : భట్టి

-

బీఆర్ఎస్కు దిమ్మతిరిగే విధంగా కొద్దిరోజుల్లోనే మరో రెండు గ్యారెంటీలను అమలు చేయబోతున్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్ర సంపదను లూటీ చేసిందని లక్షల కోట్ల అప్పుల భారం మోపిందని ఆరోపించారు. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అవాకులూ, చవాకులు పేల్చుతున్న బీఆర్ఎస్ నాయకులకు వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన రీతితో బుద్ధి చెబుతారన్నారు.

“రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల కోసం టీఎస్పీఎస్సీ ప్రక్షాళన మొదలైంది. చైర్మన్తో పాటు కమిటీ సభ్యుల నియామకం పూర్తి చేశాం. ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ ప్రకటించిన విధంగానే ఉద్యోగాల నియామకం చాలా పారదర్శకంగా, ప్రశ్న పత్రాలు లీక కాకుండా పకడ్బందీగా చేపడతాం. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేసి ప్రజల ముందు ఉంచుతాం. వ్యవసాయం, ఇరిగేషన్, ఐటీ, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి పాటు పడతాం. విద్యా, వైద్యం, ఉద్యోగ, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పనకు ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలనలో పెద్ద పీట వేశాం. ధనిక రాష్ట్రాన్ని గత పాలకుల చేతుల్లో పెడితే అప్పుల పాలు చేసింది. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అరాచకంపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు వాస్తవ విషయాలు చెప్పాం.” అని భట్టి విక్రమార్క తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news