బొగ్గు గనుల వేలం ప్రక్రియను వెంటనే ఆపేయాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

-

సింగరేణి బొగ్గు గనుల వేలం హైదరాబాద్ లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దాదాపు 40 బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. 2032 వరకు దాదాపు 22 బొగ్గు గనులను మూసివేస్తారని  తెలిపారు. 2060 నాటికి 17.8 మిలియన్ టన్నులకు పడిపోతుందని అంచెనాలు చెబుతున్నాయి. బొగ్గు ఉత్పత్తి సామర్థ్యాన్ని 2031, 32 వరకు నిలబెట్టుకోవాలన్న కొత్త బొగ్గు గనులనుసంపాదించాల్సిందే అన్నారు. కొత్తగా అదనంగా బొగ్గు గనులను సంపాదించుకోకపోతే సింగరేణి బొగ్గుగనిగా మిగలదు అన్నారు. సింగరేణి గురించి రాష్ట్ర ప్రజలకు తెలియాలని ఈ గణాంకాలను చెబుతున్నట్టు తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

సింగరేణి ఈ రాష్ట్రానికి తలమానికం అన్నారు. దేశంలో ఉన్నటువంటి బొగ్గు గనులన్నింటిని.. ఎవ్వరికీ ఏ ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించే వీలు లేకుండా బొగ్గును ఖతం పెట్టారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం బిల్లు పెడితే.. బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. సింగరేణి బొగ్గు గనిలకు బ్లాక్ లను కేటాయించడానికి వీలు లేకుండా పోయిందని తెలిపారు. సింగరేణిని నేనే కాపాడుదామని తెలిపారు. బొగ్గు గనుల వేలం ప్రక్రియను వెంటనే ఆపేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news