యువత ఆత్మహత్యలకు బీఆర్ఎస్ కారణం అవుతుంది సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. యువత ఆత్మహత్యలకు బీఆర్ఎస్ సర్కారు కారణమవుతోందని స్పష్టం చేశారు. దొరల తెలంగాణ, తెలంగాణ మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. ఈ యుద్ధంలో ప్రజలే గెలవాలని రాహుల్ గాంధీ చెప్పారు.
యావత్ దళిత, గిరిజన, బడుగు, బలహీన కుటుంబాలకు కాంగ్రెస్ తీసుకొచ్చిన పథకాలను అమలు చేయడం లేదు. మోసపూరిత వాగ్దానాలతో బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో.. దళిత, గిరిజన కుటుంబాలు అల్లాడిపోయి.. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. మానవత్వంతో కూడిన పాలన అందించాలి తప్ప.. జనం, సమాజం మరణించినా తమకు పట్టనట్టు వ్యవహరించడం కాదు. ప్రజలు కన్న తెలంగాణ రాలేదు. తెలంగాణ వచ్చి పదేళ్లవుతున్నా దశాబ్ద కాలంగా ఆ తెలంగాణ రాలేదు. కేవలం కేసీఆర్ కుటుంబం కోసమే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం బాగుపడుతుందే తప్పా.. తెలంగాణ ప్రజలు కష్టాల్లోనే ఉన్నారు.