తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తమ్ముడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావుకు ఊహించని షాక్ తగిలింది. ఎర్రబెల్లి ప్రదీప్‌రావుకు గన్మెన్లను తొలగిస్తూ కేసీఆర్ సర్కార్ కీలక నిర్నయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది కేసీఆర్ సర్కార్.
అయితే, ఈ వివాదంపై ఎర్రబెల్లి ప్రదీప్‌రావు స్పందించారు. తాను బీజేపీలో చేరినందుకే గన్మెన్లను ప్రభుత్వం తొలగించిందని ప్రదీప్‌రావు ఆరోపణలు చేశారు.. ఓ ఎమ్మెల్యే నా అంతు చూస్తానని బెదిరిస్తున్నాడు.. ఇలాంటి సమయంలో గన్మెన్ల తొలగింపు కక్షసాధింపు చర్యే అంటూ నిప్పులు చెరిగారు ప్రదీప్‌రావు. వెంటనే తనకు భద్రత పెంచాలని డిమాండ్ చేశారు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు.