కేసీఆర్ పార్టీకి ఊహించని షాక్ తగిలేలా కనిపిస్తోంది. మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ మారబోతున్నారట. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళతారని మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి మనసు మార్చుకున్నారట. టీడీపీలోకి మాజీ మంత్రి మల్లారెడ్డి వెళ్లేందుకు సిద్ధం అయ్యారట. ఇందులో భాగంగానే…. ఇప్పటికే కొంత మందితో భేటీ అయ్యారట మాజీ మంత్రి మల్లారెడ్డి.
గతంలో చేసిన అక్రమాలు బయటపడతాయని భయపడుతున్నారట మల్లన్న.. టీటీడీపీలో చేరితే తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి మాజీ మంత్రి మల్లారెడ్డికి ఇస్తారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. తెలుగు దేశం పార్టీలో చేరితే… అందర్నీ రాజకీయంగా కాపాడుకుంటానంటూ హామీలు కూడా ఇస్తున్నారట మాజీ మంత్రి మల్లారెడ్డి. దీంతో ఇప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి వార్త వైరల్ గా మారింది.