మహబూబాబాద్ బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఊహించని షాక్ తగిలింది. ఈ ఎమ్మెల్యే మాకు వద్దు అంటూ బీఆర్ఎస్ నేతలు తిరుగుబాటు చేసారు. ఇందులో భాగంగానే, మహబూబాబాద్ BRS ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు వ్యతిరేకంగా సొంత పార్టీ కార్యకర్తలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.
రెండుసార్లు గెలిపిస్తే భూ కబ్జాలు, రక్తపాతం సృష్టించారని, కార్యకర్తలను అణగదొక్కారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో శంకర్ నాయక్ గెలిస్తే మానుకోటను మరో బీహార్ చేస్తారని… కొత్త అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని కేసముద్రం, కోడూరు మండలాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు తీర్మానం చేశారు. వచ్చే ఎన్నికల్లో శంకర్ నాయక్‌కు టికెట్ ఇస్తే ఓడిస్తామని మహబూబాబాద్ శివారులోని ఓ మామిడి తోటలో 100 మందికి పైగా బీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం.. శంకర్ నాయక్ కు వ్యతిరేకంగా సొంత పార్టీ కార్యకర్తలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.