కల్వకుర్తిలో కమలానికి బ్యాడ్‌లక్ పోయినట్లేనా?

-

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం..ఎన్టీఆర్‌ని ఓడించిన నియోజకవర్గం..వరుస విజయాలతో దూసుకెళుతున్న ఎన్టీఆర్ అప్పటిలో ఏ స్థానంలో నిలబడిన గెలిచేవారు. కానీ 1989లో ఎన్టీఆర్ తొలిసారి కల్వకుర్తిలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ చేతులో ఎన్టీఆర్ ఓడిపోయారు. ఇక ఎన్టీఆర్ ని ఓడించిన నియోజకవర్గంగా పేరొందిన కల్వకుర్తిలో ఇప్పుడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

 

గతంలో ఇక్కడ టి‌డి‌పి, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటిగా గెలిచేవి. గత ఎన్నికల్లోనే ఇక్కడ బి‌ఆర్‌ఎస్ గెలిచింది..అయితే ఈ సారి ఎన్నికల్లో బి‌జే‌పికి గెలుపుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. గత రెండు ఎన్నికల్లో బి‌జే‌పి బ్యాడ్ లక్ అని చెప్పాలి..వరుసగా రెండు సార్లు స్వల్ప మెజారిటీ తేడాతోనే బి‌జే‌పి ఓడింది. 2014లో కేవలం 32 ఓట్ల తేడాతో బి‌జే‌పి ఓడిపోగా, 2018 ఎన్నికల్లో కూడా 3 వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది. రెండుసార్లు బి‌జే‌పి తరుపున ఆచారి తాల్లోజు పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఈ సారి ఖచ్చితంగా గెలవాలనే కసితో ఆచారి పనిచేస్తున్నారు. అటు బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఉన్నారు. ఈ సారి ఈయనకు  పెద్ద పాజిటివ్ కనిపించడం లేదు. ఆయనకు చెక్ పడేలా ఉంది. అటు కాంగ్రెస్ నుంచి వంశీ చంద్ రెడ్డి ఉన్నారు..ఆయన కూడా ఈ సారి గెలవాలని పట్టుదలతో పనిచేస్తున్నారు. అయితే ఇక్కడ బి‌జే‌పికే పాజిటివ్ కనిపిస్తుంది.

బి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిల మధ్యే ప్రధాన పోరు జరగనుంది. అయితే రాష్ట్రంలో కాస్త బి‌జే‌పి గాలి గాని వస్తే..కల్వకుర్తిలో గెలవడం సులువు అని చెప్పవచ్చు. అయితే కల్వకుర్తి టౌన్ లో బి‌జే‌పి ఇంకా పికప్ అవ్వాలి. అక్కడ గాని బలపడితే డౌట్ లేకుండా కల్వకుర్తిలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news