రేవంత్ మీద ఆశలు పెట్టుకున్న బిజెపి…!

-

తెలంగాణాలో కాంగ్రెస్ భవిష్యత్తు ఏంటీ…? అసలు ఆ రాష్ట్రంలో జాతీయ పార్టీల భవిష్యత్తు ఏంటీ…? దీనిపై సమాధానం చెప్పడం కనీసం అంచనా వేయడం కూడా కష్టమే. ఇక్కడ తెరాస చాలా బలంగా ఉంది. ఈ విషయం హుజూర్ నగర్ ఉప ఎన్నిక తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పష్టంగా అర్ధమైంది. ఇక్కడ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు బాగానే దగ్గరయ్యాయి.

దీనితో జాతీయ పార్టీలు ఏది చేసిన అయేది మాట్లాడినా సరే ముఖ్యమంత్రి కేసీఆర్ కి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నాయి అనే అనుమానం ప్రజల్లో కూడా బలపడింది. కరోనా కట్టడి విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు దేశ వ్యాప్తంగా అమలు చేసే ఆలోచనలో కేంద్రం సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న తరుణంలో విపక్షాలకు చెందిన నేతలు రాజకీయ మనుగడ కోసం చాలా కష్టపడుతున్నారని అర్ధమవుతుంది.

వాళ్ళు కేసీఆర్ లేదా తెరాస ప్రభుత్వాన్ని ఏదో విమర్శించాలి అని విమర్శించడమే గాని దానికి అర్ధం లేదు అనే భావనకు ప్రజలు వెళ్ళిపోయారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఈ తరుణంలో బిజెపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. తెలంగాణా కాంగ్రెస్ కి ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది. ఒకరిద్దరు మంచి నేతలు కూడా ఉన్నా సరే ఇతర నేతల విషయంలో సహకారం లేదు.

దీనితో ప్రతిభ ఉన్న యువనేతలను పార్టీలోకి తీసుకోవాలని తెలంగాణా బిజెపి భావిస్తుంది. ఇటీవల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ రేవంత్ రెడ్డి విషయంలో కాస్త ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. ఆయనను పార్టీలోకి తీసుకోవాలని కిషన్ రెడ్డిని కలిసిన సందర్భంలో కూడా సంజయ్ విజ్ఞప్తి చేసారు. ఇప్పుడు ఆయన పార్టీలోకి వస్తే కేసీఆర్ ని ఎదుర్కోవడం కాస్త సులువు అవుతుందని ఆయనకు అన్ని అవకాశాలు కల్పించాలని ఆశలు పెట్టుకుంది బిజెపి. తెలంగాణాలో కాంగ్రెస్ భవిష్యత్తు ఏంటీ…? అసలు ఆ రాష్ట్రంలో జాతీయ పార్టీల భవిష్యత్తు ఏంటీ…? దీనిపై సమాధానం చెప్పడం కనీసం అంచనా వేయడం కూడా కష్టమే. ఇక్కడ తెరాస చాలా బలంగా ఉంది. ఈ విషయం హుజూర్ నగర్ ఉప ఎన్నిక తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పష్టంగా అర్ధమైంది. ఇక్కడ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు బాగానే దగ్గరయ్యాయి.

దీనితో జాతీయ పార్టీలు ఏది చేసిన అయేది మాట్లాడినా సరే ముఖ్యమంత్రి కేసీఆర్ కి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నాయి అనే అనుమానం ప్రజల్లో కూడా బలపడింది. కరోనా కట్టడి విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు దేశ వ్యాప్తంగా అమలు చేసే ఆలోచనలో కేంద్రం సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న తరుణంలో విపక్షాలకు చెందిన నేతలు రాజకీయ మనుగడ కోసం చాలా కష్టపడుతున్నారని అర్ధమవుతుంది.

వాళ్ళు కేసీఆర్ లేదా తెరాస ప్రభుత్వాన్ని ఏదో విమర్శించాలి అని విమర్శించడమే గాని దానికి అర్ధం లేదు అనే భావనకు ప్రజలు వెళ్ళిపోయారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఈ తరుణంలో బిజెపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. తెలంగాణా కాంగ్రెస్ కి ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది. ఒకరిద్దరు మంచి నేతలు కూడా ఉన్నా సరే ఇతర నేతల విషయంలో సహకారం లేదు.

దీనితో ప్రతిభ ఉన్న యువనేతలను పార్టీలోకి తీసుకోవాలని తెలంగాణా బిజెపి భావిస్తుంది. ఇటీవల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ రేవంత్ రెడ్డి విషయంలో కాస్త ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. ఆయనను పార్టీలోకి తీసుకోవాలని కిషన్ రెడ్డిని కలిసిన సందర్భంలో కూడా సంజయ్ విజ్ఞప్తి చేసారు. ఇప్పుడు ఆయన పార్టీలోకి వస్తే కేసీఆర్ ని ఎదుర్కోవడం కాస్త సులువు అవుతుందని ఆయనకు అన్ని అవకాశాలు కల్పించాలని ఆశలు పెట్టుకుంది బిజెపి.

Read more RELATED
Recommended to you

Latest news