గత కొన్ని రోజులుగా తెలంగాణలో చర్చల్లో ఉన్న హైడ్రా కమిషన్ కు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేతల పై ఫోకస్ పెట్టిన హైడ్రా కు చెరువులో ఓవైసీ బిల్డింగ్ లు కనిపించడం లేదా అని ప్రశ్నించారు మహేశ్వర్ రెడ్డి. వాటిని కూలగొట్టే దమ్ము ధైర్యం హైడ్రాకు లేదా.. కావాలంటే మీతో నేను వస్తా పదండి అని అన్నారు. ఒకవేళ వాటిని కూల్చడానికి బుల్డోజర్ లు లేకుంటే పక్క రాష్ట్రం నుండి నేను తెప్పిస్తా అని పేర్కొన్నారు మహేశ్వర్ రెడ్డి.
హైడ్రా తీరు చూస్తుంటే కొద్దిమందిని మాత్రమే టార్గెట్ చేస్తున్నట్టు గా ఉంది. అసలు ఈ కూల్చివేతలు మొదట ఓవైసీ బిల్డింగ్ ల నుండి మొదలు పెట్టండి. ఎప్పటి లోగా ఒవైసీ ఆక్రమణలను తొలగించి… ఆ భూములను స్వాధీనం చేసుకుంటారో ప్రభుత్వం చెప్పాలి. అయితే అక్బరుద్దీన్ ఓవైసీ తన నిర్మాణాలను స్వచ్ఛందంగా కూల గొట్టుకుంటే బాగుండేది. కానీ ఆయన సిగ్గు మాలిన మాటలు మాట్లాడుతున్నారు అని మహేశ్వర్ రెడ్డి తెలిపారు.