ఏపీకి 13లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి..!

-

రాష్ట్రంలో ఆర్ధికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. 13 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి అని మంత్రి అచ్చెం నాయుడు తెలిపారు. ఏ మంత్రి, ఏ శాఖను రివ్యూ చేసిన ఎక్కడా అప్పులు తప్ప ఆదాయం కనిపించడంలేదు. కానీ ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని ఇబ్బందులు ఉన్న ఒకొక్క హామీని నెరవేరుస్తాం. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా పెంచిన పింఛన్లు అందించాం.

రాష్ట్రంలో మరో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభానికి అంచనా వేశారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో శ్రేయోభిలాషులు, ఎన్ఆర్ఐ సోదరులు ఇచ్చిన డబ్బులతో అన్న క్యాంటీన్ నడిపాం. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి ప్రజలు సమస్యలు తెలుసుకుంటున్నాను. ఛాలెంజింగ్ గా ఉన్న కార్యక్రమాలు చిత్తశుద్దితో నిర్వహిస్తాను. ప్రజలు మెచ్చే నాయకుడిగా నేను పనిచేసి చూపిస్తాను. అధికారులు బదిలీలు పార్డర్శకంగా జరుగుతాయి. అటెండర్ నుండి ఉన్నతాధికారి వరకు బదిలీలు కోసం ఒక్క పైసా ఇచ్చినా తీసుకున్న చర్యలు తీసుకుంటాము. బదిలీల కోసం పైరవీలుకు ప్రోత్సహించవద్దు. ప్రజలు, నాయకులు, కార్యకర్తలు గౌరవాన్ని పెంచే విధంగా పని చేస్తాను. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంశంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు మంత్రి అచ్చెం నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news