కేసీఆర్ ప్రభుత్వానికి రైతాంగం ఉసురు తప్పదని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. త్వరలో తెలంగాణలో 5.50లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం కొనేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు ఈటల రాజేందర్. కేసీఆర్ మాటలు విని రైతాంగం అగమైందని.. తెలంగాణ పండించిన మెజారిటీ పంట సీడ్ కంపెనీ కొరకు పండించింది తప్ప కేసీఆర్ కొంటాడన్న నమ్మకంతో కాదని నిప్పులు చెరిగారు.
కేసీఆర్ అనాలోచిత నిర్ణయం కారణంగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల లో ఆలస్యం అయిందని.. అకాల వర్షాలతో కల్లాలలోనే ధాన్యం తడిసి కొట్టుకపోతుందని మండి పడ్డారు.చరిత్రలో రైతులను ఎవరు శాసించలేదు… ఒక్క కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే చెప్పిన పంట వేయాలని రైతులను శాసించారని.. కేంద్రం కొంటామని చెప్పిన కేసీఆర్ మాత్రం రైతుల పేరుతో రాజకీయం చేశారని అగ్రహించారు.
రాష్ట్రంలో సరైన కొనుగోళ్లు, గన్ని బ్యాగులు, ట్రాన్స్పోర్ట్ లేక రైతాంగం అగమైపోయిందని.. మిల్లులు టోకెన్లు ఇస్తేనే కొనే దుర్భర పరిస్థితి నెలకొందని విమర్శించారు ఈటల రాజేందర్. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను, తడిసిన వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈటల రాజేందర్.