మేం ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మం. పీపుల్ పోల్స్‌నే నమ్ముతాం : ఎంపీ లక్ష్మణ్

-

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ రియాక్ట్ అయ్యారు. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కు అనుకూలంగా రావడంపై స్పందించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాము ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మడం లేదని.. పీపుల్ పోల్స్‌ను మాత్రమే నమ్ముతామని స్పష్టం చేశారు. కన్నడ ప్రజలు మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు.

మరోవైపు తెలంగాణలో రైతులకు సీఎం కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టే సమయం, ధనం ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ఉంది కానీ.. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునే మనసు మాత్రం లేదని దుయ్యబట్టారు. రైతులు బాధపడుతుంటే సీఎం, మంత్రులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతుల సమస్యలపై సమీక్ష చేసే సమయం సీఎంకు లేదా అని ప్రశ్నించారు. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎంపీ లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికీ సమీక్ష చేసే తీరికలేకపోవడం చూస్తోంటే.. రైతుల పట్ల ఉన్న చిత్త శుద్ది అర్ధమవుతుందని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news