తెలంగాణలో 50 లక్షల టార్గెట్ పెట్టుకున్న బీజేపీ..!

-

పార్టీ ప్రధాన కార్యదర్శులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్ది భేటీ అయిన విషయం తెలిసిందే. పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు, పార్టీ సభ్యత్వం, హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలుపై చర్చించారు. అయితే రాష్ట్రంలో సభ్యత్వానికి సమాయత్తం అవుతుంది బీజేపీ. ఈ నెల 17 న ఢిల్లీలో సభ్యత్వ నమోదుపై వర్క్ షాప్ ఉండనుంది. దీనికి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులు హాజరు కానున్నారు.

ఆ తర్వాత ఈ నెల 22న తెలంగాణలో వర్క్ షాప్ ఉండనుంది. దీని తర్వాత జిల్లాల వారీగా కూడా వర్క్ షాప్స్ నిర్వహించనున్నారు. అయితే ఈసారి తెలంగాణలో 50 లక్షల సభ్యత్వం టార్గెట్ పెట్టుకున్నారు బీజేపీ లీడర్లు. ప్రతి పోలింగ్ బూత్ లో కనీసం వంద సభ్యత్వలు కావాలనేదే టార్గెట్. ఇక ఈ సభ్యత్వ నమోదుకు ఇంఛార్జిలను నియమించనుంది బీజేపీ. సభ్యత్వ అభియాన్ లో పాల్గొననున్న బీజేపీ ముఖ్యనేతలు… 10 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగించనున్నారు. ఇక వంద సభ్యత్వలు చేసిన వారికి క్రియాశీల సభ్యత్వం ఇవ్వనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news