bollam mallayya yadav on brs:బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్‌గా మార్చాలని నా అభిప్రాయం అన్నారు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బోల్లం మల్లయ్య యాదవ్. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో జరుగుతున్న కొంతమంది ప్రక్క రాష్ట్ర సమైక్య వాదుల దాడిని అరికట్టాలంటే ప్రాంతీయతత్వం బ్రతకాలంటే , తెలంగాణ ఆత్మ గౌరవం, యాస, భాష , సంస్కృతిని కాపాడడానికి బీఆర్ఎస్ పేరు నుంచి టీఆర్ఎస్‌గా మారాల్సిన అవసరం చాలా ఉందని పేర్కొన్నారు బోల్లం మల్లయ్య యాదవ్.
సమైక్య వాదులు కూడా జై తెలంగాణ నినాదంను గౌరవించిన మన తెలంగాణ రాష్ట్రంలో నేటి పాలనలో జై తెలంగాణ నినాదం ఎత్తితే లాఠీలతో కొట్టే రోజులు రావడం చాలా బాధాకరం అని చెప్పారు.
ఢిల్లీ నుండి పాలన అందిస్తున్న కేంద్ర పార్టీల కంటే తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఏకైక ప్రాంతీయపార్టీ TRS పార్టీ , ఉద్యమాన్ని ఉరుకలెత్తించి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ ను తెచ్చిన ఏకైక పార్టీ టీఆర్‌ఎస్ పార్టీ అని కొనియాడారు. TRS గా మారాల్సిన సమయం వచ్చింది తెలంగాణ సమాజం కోసం అంటూ పోస్ట్ పెట్టారు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బోల్లం మల్లయ్య యాదవ్.