మహబూబ్ నగర్ లో సీఎం కెసిఆర్ ఆరోపణల సభ పెట్టారని మండిపడ్డారు బిజెపి నేత బూర నరసయ్య గౌడ్. సీఎం విస్మరించిన వాగ్దాలన్నింటిని కేంద్రం పై మోపారని అన్నారు. కృష్ణ నది జలాల్లో 299 టీఎంసీ లకు సీఎం ఒప్పందం పై సంతకం పెట్టిన మాట వాస్తవం కాదా? అని నిలదీశారు.
దిండి ప్రాజెక్ట్ కు ఎక్కడి నుండి నీళ్ళు తీసుకుంటారో డీపీఆర్ లో పొందుపర్చారా? అని ప్రశ్నించారు. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల పై ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. యాసంగి పంటకు కాళేశ్వరం ద్వారా ఒక ఎకరానికి కూడా నీరు ఇస్తున్నట్లు చెప్పలేదన్నారు. ఏపీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను స్పీడ్ గా పూర్తి చేసిందని.. సీఎం కెసిఆర్ దానికి సహకరించారని… అక్కడి సీఎం తో కుమ్మక్కై తెలంగాణ కి అన్యాయం చేశారని ఆరోపించారు.
తెలంగాణ లో స్కాం లేని స్కీమ్ ఉండదన్నారు బూర నర్సయ్య గౌడ్. TRS ఎమ్మేల్యే లు ఒక్కొక్కరు వంద కోట్ల కు తక్కువ ఉండరని అన్నారు. గుజరాత్ లో లాగా మద్యం పై నిషేదం పెట్టీ అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు.