బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ నేతలను ఆహ్వానించలేదు : మంత్రి పొన్నం ప్రభాకర్

-

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సరిగ్గా రేపటికి 10 సంవత్సరాలు పూర్తి అవుతుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండిన విషయం తెలిసిందే.  తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా అధికారంలో ఉండటంతో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు సైతం కాంగ్రెస్ నేతలపై ప్రతి విమర్శలు చేస్తున్నారు.

ఈ తరుణంలోనే  తెలంగాణ కోసం ఎన్నో వర్గాల ప్రజలు పోరాటం చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను ఆయన పరిశీలించి మాట్లాడారు. తెలంగాణ వచ్చాక పదేళ్లు నియంతృత్వం కొనసాగిందని విమర్శించారు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. అమర వీరులను స్మరించుకుంటూ ఆవిర్భావ వేడుకలు జరుగుతాయని వివరించారు. రాజకీయాలకు అతీతంగా వేడుకలకు అందరినీ ఆహ్వానిస్తున్నట్లుతెలిపారు.

“ప్రధాని మోడీ ఎన్నోసార్లు తెలంగాణ ఏర్పాటును అవమానించారు. వేడుకలకు సోనియా గాంధీ వస్తారని ఆశిస్తున్నాం. గత ప్రభుత్వం తెలంగాణ వేడుకలకు కాంగ్రెస్ నేతలను ఆహ్వానించలేదు. రాష్ట్ర చిహ్నం రూపకల్పనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరి అభిప్రాయాలు తీసుకోలేదు” అని పొన్నం ప్రభాకర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news