కేసీఆర్ సర్కార్ విధానాల వల్ల రాష్ట్రం మద్యంతో నిండిపోయింది – కిషన్ రెడ్డి

-

కెసిఆర్ సర్కార్ అనుసరిస్తున్న విధానాల కారణంగా రాష్ట్రం మద్యంతో నిండిపోయిందన్నారు కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి. మంగళవారం హైదరాబాదులోని బిజెపి కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ఆదాయం కోసం విచ్చలవిడిగా లిక్కర్ అమ్మకాలను కెసిఆర్ సర్కార్ ప్రోత్సహిస్తుందన్నారు.

కల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ దోపిడీకి గురవుతుందన్నారు. దేశంలో అత్యధిక అవినీతికి పాల్పడుతున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఆరోపించారు. దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు ఫైనాన్స్ చేస్తున్నారని.. ఇన్ని వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించుకున్నారో తెలంగాణ ప్రజాణికం అంతా చూస్తుందన్నారు. బిజెపి కార్యకర్తలు ప్రజా సమస్యలపై పోరాడుతుంటే వాటికి అనుమతి ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. నోటిఫికేషన్లు ఇవ్వడం, పేపర్ లీకులతో నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news