అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ కు కేటాయించిన ఛాంబర్ పై మరోసారి రగడ చోటు చేసుకుంది. ఈ తరునంలోనే… అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ కు కేటాయించిన ఛాంబర్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రెండు రూమ్ లు కలిపి ఒకే రూంగా మార్చింది అసెంబ్లీ సిబ్బంది.
రూం మద్యలో టాయిలెట్ పెట్టి వాడుకోవడానికి అనుకూలంగా లేకుండా చేసారని మండిపడింది బీఆర్‌ఎస్. ఈ అంశాన్ని బిఎసి లో లేవనెత్తాలని హరీష్ రావుకు సూచించారు కేటీఆర్. ఇక అటు గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలలో సభకు నలుగురు ఎమ్మెల్యేలు హజరు అయ్యారు. అసెంబ్లీ లో వెనుక సీట్లలో కూర్చున్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలు. పోచారం, కడియం శ్రీహరి, గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య లు హాజరు అయ్యారు. ఏ పార్టీ కండువా కప్పుకోకుండా వెనుక వరుస లో కూర్చున్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలు.