5 నెలల్లో బీఆర్ఎస్ ఉద్యోగం పీకడం ఖాయం – జీవన్ రెడ్డి

-

పంచాయితీ సెక్రటరీలు 5 గంటల లోపు విధులలో చేరాలని డెడ్ లైన్ పెట్టడం దుర్మార్గం అన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఉద్యోగులను బెదిరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి అంబేడ్కర్ ఇదే చెప్పారా..? అని ప్రశ్నించారు. సమ్మె చేస్తున్న వారిని బెదిరించడం మానుకోవాలని హితువు పలికారు జీవన్ రెడ్డి. ముందు మీ ఉద్యోగం చూసుకోవాలని.. మరో 5నెలల్లో మీ ఉద్యోగం పీకడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. పంచాయితీ సెక్రటరీలను బెదిరించడం మానుకోవాలన్నారు.

గ్రామాల అభివృద్ది కోసం పంచాయితీ సెక్రటరీలను నియమించారని.. మూడేళ్ల ప్రొబేషనరీ పెటియాడ్ తర్వాత క్రమబద్దీకరణ చేస్తామనే ఒప్పందంతో వారిని నియమించారని.. పంచాయితీ సెక్రటరీల ప్రోబిషనరి పీరియడ్ ను మరో ఏడాది పెంచారని గుర్తు చేశారు. వారికున్న హక్కుతో సమ్మె నోటీసు ఇచ్చి వారు సమ్మెకు వెళ్లారని అన్నారు జీవన్ రెడ్డి. సమ్మె చేసే హక్కు లేదని ఎర్రబెల్లి మంత్రిలా కాకుండా దొరలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పంచాయితీ సెక్రెటరీలను క్రమబద్దీకరించి వారికి పే స్కేల్ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news