రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఏక్నాథ్ షిండే అవుతాడంటూ BRS MLA పాడి కౌశిక్ రెడ్డి బాండ్ పేల్చారు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళతాడని.. ఆ కేసును తప్పించుకునేందుకు…ఏక్నాథ్ షిండే అవుతాడంటూ రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేశారు BRS MLA పాడి కౌశిక్ రెడ్డి.

ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు? భర్తీ ఎప్పుడు జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వాముపై పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాలు పని చేయాలని బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎంకి రివర్స్ అయ్యే అవకాశం ఉందని అన్నారు.కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షిండే అయ్యేది రేవంత్ రెడ్డి అని అన్నారు. ప్రతి నిత్యం అబద్ధాలు ఆడటమే పనిగా పెట్టుకునే వాడిని పాథలాజికల్ లయ్యర్ అని అంటారని ఆయన విమర్శించారు.