లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఒక్క సీటు కూడా రాదు : మంత్రి కోమటిరెడ్డి

-

రాష్ట్రంలో కాంగ్రెస్  ప్రభుత్వం రావడంతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  అన్నారు. భువనగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయని చెప్పారు. ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు అందిస్తున్నామన్నారు. గ్రూప్-1, డీఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చామని.. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. యాదగిరిగుట్ట దేవస్థానం నిర్మాణంపై విచారణ చేయిస్తామని తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు  నిర్మాణం విషయంలో మార్పులు, చేర్పులు ఉంటాయన్నారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా దాన్ని పూర్తిచేస్తామని చెప్పారు.


బీఆర్ఎస్  ప్రతిష్ఠ దిగజారింది. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్  రాలేదు. ఆ పార్టీ ఖాళీ అయింది. లోక్సభ ఎన్నికల్లో వారికి ఒక్క సీటూ రాదు. రాష్ట్రంలో 13-14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. భారాస నేతలే మమ్మల్ని అభినందిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు మరింత శ్రమించాలి. రాహుల్గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసింది. తెలంగాణ నుంచి ఆయన పోటీ చేస్తే ప్రజలు కచ్చితంగా గెలిపిస్తారని కోమటిరెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news