తెలంగాణ భవన్ లో మూడున్నర గంటల పాటు సమావేశం అనంతరం కేటీఆర్ కీలక కామెంట్స్ చేసారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి లో బీసీ డిక్లరేషన్ ఇచ్చింది. BRS తరుపున కాంగ్రెస్ పార్టీ ని డిమాండ్ చేస్తున్నాం. కామారెడ్డి లో చెప్పిన బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి. సమగ్ర కులగణన చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నవంబర్ 10 డెడ్ లైన్ పెడుతున్నాం. ఆ లోపు చెప్పిన విధంగా అమలు చేయాలి. లేకుంటే BRS కార్యాచరణ ప్రకటిస్తాం.
మంత్రి వర్గ విస్తరణ లో బీసీ లకు పదవులు ఇవ్వాలి. బీసీల కోసం BRS కదిలింది. బీసీ లు పడుతున్న సమస్యలు క్షేత్ర స్థాయిలో తెలుసుకుంటాం. గతంలో బీసీ లకు ఎక్కువ సీట్లు brs ఇచ్చింది. స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ లకు ఇవ్వాల్సిందే. గాంధీ ఆసుపత్రిలో ఆగస్టు నెలలో 82 మంది చనిపోయారు. అవసరం అయితే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి. జమిలీ ఎన్నికల విషయం లో కేంద్ర ప్రభుత్వం వివరంగా చెప్పాలి. మొన్ననే కేంద్రం లో ఎన్నికలు పూర్తి అయ్యాయి. కేంద్రం విడమరిచి చెప్పిన తర్వాత మా నిర్ణయం చెబుతాం. పార్టీ లో అందరి తో చర్చించి నిర్ణయం వెల్లడిస్తాం. నవంబర్ 10 తర్వాత అవసరం అయితే బీసీ లతో బహిరంగ సభ పెడుతాం అని కేటీఆర్ వెల్లడించారు.