అన్ని వర్గాలకు సంతృప్తి కలిగించేలా బడ్జెట్ ని ప్రవేశపెట్టారు – విజయశాంతి

-

దేశంలో అన్ని వర్గాలకూ సంతృప్తి కలిగించేలా ఒక ప్రొగ్రెసివ్ బడ్జెట్‌ని కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారని అన్నారు బిజెపి నేత విజయశాంతి. ముఖ్యంగా కోట్లాదిమంది వేతన జీవుల కష్టాన్ని గౌరవిస్తూ పన్నుమినహాయింపు కనిష్ఠ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

“డిజిటల్ లైబ్రరీలు, ఏకలవ్య పాఠశాలలతో విద్యార్థులకు, సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ డిపాజిట్ పరిమితి పెంచి వృద్ధులకు, మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీమ్ కింద స్త్రీలకు, పీఎం కౌశల్ పథకంతో నిరుద్యోగులకు, అగ్రి స్టార్టప్స్‌కి ప్రత్యేక నిధితో యువరైతులకు, గిరిజన మిషన్‌‌కు భారీగా నిధులిచ్చి అడవి బిడ్డలకు ఇలా ఒకటేమిటి అన్ని రంగాలకూ ఈ ప్రయోజనాలందించేలా ఈ బడ్జెట్ ఉంది.

అలాగే… 5జీ సేవలకు 100 ప్రత్యేక ల్యాబ్‌లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ల ప్రతిపాదనలతో టెక్నాలజీకి… చిన్న పట్టణాల్లోనూ ఎయిర్ పోర్టులు, హెలీప్యాడ్స్ నిర్మాణ ప్రతిపాదనలతో రవాణా రంగానికి కేంద్ర బడ్జెట్ ప్రోత్సాహం ఇచ్చింది. మధ్యతరగతివారికి ఎక్కువగా అవసరమైన మొబైల్ ఫోన్స్ విడిభాగాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించింది.ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మిలెట్లకు పెద్ద పీట వెయ్యాలని సంకల్పించింది. ఇలా అన్ని విధాలుగా మేలైన బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన మన కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ గారికి అభినందనీయులు” తెలిపారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news