నారాయణగూడ తాజ్ మహాల్ హోటల్ లో బిజెపి రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ కు సన్మాన కార్యక్రమం జరిగంది.గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి కేబుల్ అపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు.
రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా లక్ష్మణ్ ను సన్మానించారు గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి కేబుల్ అపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ..”రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నన్ను సన్మానించడం సంతోషంగా ఉంది.నాకు కేబుల్ ఆపరేటర్లతో ప్రత్యేక అనుబంధం ఉంది.కెబుల్ ఆపరేటర్ల సమస్యల పరిష్కారం ప్రభుత్వాలపై ఆధారపడి ఉంటుంది.
కెబుల్ రంగంలో పోటీ ప్రపంచం ఉండేది.
వేల్ఫేరే అసోషియేషన్ ఏర్పాటు చేసుకుని తగువులు, వివాదాలు లేకుండా నివారించగలిగారు.దేశంలో ఏ మూలన చిన్న సంఘటన జరిగిన క్షణాల్లో ప్రజలకు తెలిసిపోతుంది.ఆన్లైన్ పద్ధతి ద్వారా ఏదైనా పొందే సదుపాయం ఉంది.ఓటీటీ ప్లాట్ ఫామ్ రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే సినిమా చూస్తున్నారు.థియేటర్ కు వెళ్లి సినిమాలు చూసే పరిస్థితి తగ్గింది.మారుతున్న కాలానుగుణంగా కేబుల్ ఆపరేటర్లు మారాలి.
నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని ముందుకు సాగాలి.నీస్వార్థంగా సేవ చేసే వాళ్లను ప్రధానమంత్రి గుర్తించి పద్మ అవార్డులు ఇచ్చారు.కేబుల్ ఆపరేటర్లకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా.కేబుల్ ఆపరేటర్ల సమస్య పరిష్కారానికి నా వంతు సహకారం చేస్తా” అని అన్నారు.