రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి..ఆ సీటులోనే రచ్చ!

-

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు చల్లారడం కష్టమనే చెప్పొచ్చు..ఆ పార్టీలో నేతల మధ్య ఎప్పుడు ఏదొక రచ్చ నడుస్తూనే ఉంటుంది..పైకి అంతా కలిసి పనిచేస్తామని చెప్పిన సరే లోపల మాత్రం నేతకు…నేతకు గొడవ ఉంటుంది. బడా నేతల మధ్యే కాదు ఛోటా నేతల మధ్య కూడా రచ్చ ఉంటుంది. ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే కాంగ్రెస్ నేతల మధ్య సీట్ల విషయం రగడ నడుస్తోంది.

ఇదే క్రమంలో జడ్చర్ల సీటు విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి…కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిల మధ్య జడ్చర్ల సీటు రగడ ఉందని సమాచారం. అది కూడా ఎర్రశేఖర్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో అప్పటినుంచి జడ్చర్ల లో రగడ మొదలైంది. గతంలో శేఖర్ టీడీపీలో పనిచేసిన విషయం తెలిసిందే. అలాగే పలుమార్లు జడ్చర్ల ఎమ్మెల్యేగా కూడా గెలిచారు.

అయితే తెలంగాణలో టీడీపీ కనుమరుగైన నేపథ్యంలో శేఖర్ బీజేపీలోకి వచ్చారు…కానీ అక్కడ కూడా సెట్ కాలేక చివరికి రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో…కాంగ్రెస్ లో చేరారు. ఇక శేఖర్ కాంగ్రెస్ లోకి రావడంతో జడ్చర్ల సీటు విషయంలో రచ్చ మొదలైంది. ఇప్పటికే ఈ సీటుపై కోమటిరెడ్డి సన్నిహితుడు అనిరుద్ రెడ్డి కన్నేశారు. శేఖర్ ఎంట్రీతో అనిరుద్ కు సీటు డౌటే అనే పరిస్తితి వచ్చింది.

ఎందుకంటే శేఖర్ కు జడ్చర్ల సీటు ఇవ్వాలని రేవంత్ చూస్తున్నట్లు తెలుస్తోంది…పైగా అక్కడ ఇంచార్జ్ గా ఉన్న మల్లు రవి సైతం రేవంత్ రెడ్డికి అనుకూలమే. దీంతో కోమటిరెడ్డి సన్నిహితుడుకు చెక్ పడినట్లైంది. అయితే శేఖర్ పై కేసులు ఉన్నాయని కోమటిరెడ్డి వర్గం ప్రచారం చేస్తుంది. ఆ కేసుల్లో నిర్దోషిగా శేఖర్ బయటకొచ్చారని రేవంత్ వర్గం అంటుంది. అయిన నల్గొండ రాజకీయాల్లో రేవంత్ జోక్యం చేసుకోవద్దని మాట్లాడిన కోమటిరెడ్డి…ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని రేవంత్ వర్గం ప్రశ్నిస్తుంది. ఇలా రెండు వర్గాల మధ్య పోరు జరుగుతుంది. మరి చివరికి జడ్చర్ల సీటు ఎవరికి దక్కుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news