జీవో 317 పై స్టే ఇవ్వ‌లేం.. హై కోర్టు సంచ‌ల‌నం

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ఉపాధ్యాయుల‌కు రాష్ట్ర హై కోర్టు షాక్ ఇచ్చింది. రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన జీవో నెంబ‌ర్ 317 పై తాము స్టే ఇవ్వ‌లేమ‌ని తెలంగాణ రాష్ట్ర హై కోర్టు తెల్చి చెప్పింది. ఇప్ప‌టికే ఒక సారి తెలంగాణ హై కోర్టు జీవో నెంబ‌ర్ 317 పై ఇలాగే స్పందించింది. తాజా గా ఈ రోజు కొత్త జిల్లాల‌కు ఉపాధ్యాయుల కేటాయిపుల పై విచార‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్ర హై కోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది.

High-court-for-state-of-Telangana-at-Hyderabad

కాగ రాష్ట్ర ప్ర‌భుత్వ సూచ‌న‌ల‌తో కొత్త జిల్లాల‌కు కేటాయించిన ఉద్యోగులు విధుల్లో చేరార‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ అద‌న‌పు ఏజీ రాష్ట్ర హై కోర్టు దృష్టికి తీసుకువ‌చ్చారు. అయితే ఈ విష‌యంలో వ‌చ్చిన పిటిష‌న్ల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం వివ‌ర‌ణ ఇవ్వాల‌ని రాష్ట్ర హై కోర్టు ఆదేశించింది. కొత్త జిల్లాలో ఉపాధ్యాయుల కేటాయింపు ల‌పై హై కోర్టు ఇచ్చే తీర్పు నకు త‌ప్ప‌క లోడి ఉండాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వానికి ధ‌ర్మ‌స‌నం సూచించింది. కాగ ఈ కేసులో వ‌చ్చిన పిటిష‌న్ల పై విచార‌ణ‌ను ఏప్రిల్ 4 వ తేదీ కి రాష్ట్ర హై కోర్టు వాయిదా వేసింది.