అవసరం అయితే ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

-

అసెంబ్లీ లో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల విషయంలో జరిగిన గందరగోళం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో నేను ఎవ్వరి పేర్లు ప్రస్తావించలేదని చెప్పారు. తాజాగా మీడియా చిట్ చాట్ లో మాట్లాడిన సీఎం.. మల్కాజ్ గిరిలో నా గెలుపునకు తనే బాధ్యత తీసుకుంటానని చెప్పి.. నా టికెట్ ప్రకటించగానే సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్లారని ధ్వజమెత్తారు. తమ్ముడిని ఒంటరి చేసి అక్క బీఆర్ఎస్ లోకి వెళ్లి పోయిందన్నారు.

సభలో నేను పొలిటికల్ గా అనుభవాలు మాత్రమే చెప్పాను. మోసం అనే పదానికి ప్రత్యామ్నాయం సబిత అని భట్టి క్లియర్ గా చెప్పారని.. అంతకంటే ఏం మాట్లాడగలం అన్నారు. 2014లో సబితకు టికెట్ ఇవ్వలేదు. 2018లో ఉత్తమ్ టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. సునిత లక్ష్మారెడ్డి కోసం ప్రచారానికి వెళ్తే తన పై రెండు కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను. ఈ సభ చాలా డెమోక్రటిక్ గా ఉందని.. ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందన్నారు. చర్చకు ఇవ్వాల్సిన సమయం ఇచ్చామన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్షానికి ఇంత సమయం కేటాయించారా..? అని ప్రశ్నించారు. సభలో సస్పెన్స్ ఉండొద్దు అనేది మా ఆలోచన అని అయితే అవసరాన్ని బట్టి ఎమ్మెల్యేల సభ్యత్వం కూడా రద్దు కావచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news