ఎంపీ అరవింద్‌పై కేసు నమోదు

-

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌ సమీపంలో టీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలను చించివేసిన ఘటనకు సంబంధించి ఆయనపై 504, 506, 427 సె​క్షన్ల కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. టీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంపీ అరవింద్‌తో పాటు కార్యకర్తలపై కూడా కేసు నమోదైంది.


సీఎం కేసీఆర్‌ ఫాంహౌస్‌లో ఉంటూ పాలన సాగిస్తున్నారని ఎంపీ అరవింద్ అన్నారు.‌ బీజేపీ అభ్యర్థి విజయదుర్గ సందీప్‌ యాదవ్‌కు మద్దతుగా ఆయన నిన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో టీఆర్ ఎస్ దుకాణం మూతపడటం ఖాయమన్నారు. కరీంనగర్‌, నిజామాబాద్‌, దుబ్బాక ఎన్నికల్లో ఎలా నిజాయితీకి ఓటు వేశారో అలానే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బీజేపీకి ఓటువేసి మార్పుకు నాంది పలకాలని ఎంపీ అరవింద్‌ కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news