తెలంగాణ వాహనదారులకు పోలీసులు బిగ్ షాక్ ఇవ్వనున్నారు. చలానాలు చెల్లించని వారిపై చర్యలు తీసుకునేందుకు… తెలంగాణ రాష్ట్ర పోలీసులు సిద్దం అవుతున్నారు. చలానాల రాయితీ గడువు ముగిసినా… మరో 30 శాతం మంది చలాన్లు పెండింగ్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ప్రత్యేక రాయితీల ద్వారా మూడు కోట్లకు పైగా చలాన్లు క్లియర్ అయ్యాయి అని పోలీసులు వివరించారు. 65 శాతం కార్ల యాజమానులు, 70% ద్విచక్ర వాహన దారులు పెండింగ్ చలానా లు చెల్లించారు. 1700 కోట్ల రూపాయలు పెండింగ్ చలానా లో వెయ్యి కోట్ల రూపాయలు మాత్రమే వసూలయ్యాయి.
చలాలను చెల్లించని వారిపై కేసులు నమోదు చేసి చట్ట పరమైన చర్యలు తీసుకొంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. తాము ఇప్పటికే గడువు పెంచామని.. కానీ దీనిపై వాహనదారులు రెస్పాండ్ కాలేదని పేర్కొన్నారు పోలీసులు. కాబట్టి.. ఇక పెండింగ్ చలానాలు చెల్లించని వారిపై కేసులు పెడతామని స్పస్టం చేశారు.