మహిళ స్నానం చేస్తుంటే విచక్షణ మరిచిన ఓ యువకుడు తన సెల్ ఫోన్ కెమెరాతో రికార్డు చేస్తూ దొరికిపోయిన సంఘటన పంజాబ్ లోని రాం నగర్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… రాం నగర్ కు చెందిన ఓ యువకుడు తమ పక్క ఇంట్లో నివసిస్తున్న ఓ మహిళను గత కొంత కాలంగా వెంబడిస్తున్నాడు.
అంతేకాదు.. ఆమెతో అసభ్యంగా ప్రవర్థిస్తుండగా.. పలుమార్లు ఆమె హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఒక రోజు స్నానం చేస్తుండగా.. ఆ యువకుడు నెమ్మదిగా బాత్రూం వెంటి లేటర్ నుంచి సెల్ ఫోన్ కెమెరాతో వీడియో తీయడంప్రారంభించాడు.
అయితే.. చుట్టు పక్కల వాళ్లు గమనించి.. అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం బాధితురాలి కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్లు నిందితుడిని బంధించి.. చితకబాది పోలీసులకు అప్పగించారు. నిందితుడు బీటెక్ విద్యార్థి అని తేలగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.