సంవత్సరం అయినా 18 మంత్రి నింపలేనోడివి.. బీసీలకు ఏం చేస్తావని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాజాగా ఆయన వరంగల్ లో మీడియాతో మాట్లాడారు. బీసీ ఓట్ల కోసమే కులగణన డ్రామా అన్నారు. కులగణన అంటున్నావు.. కానీ రిజర్వేషన్ల గురించి మాత్రం మాట మాట్లాడటం లేదన్నారు. ఇంట్లో టీవీ, ప్రిడ్జ్ ఉందా..? సర్వేలో అడగడమేంటి అని ప్రశ్నించారు కేటీఆర్. బీసీ డిక్లరేషన్ హామీలు ఒక్కటైనా అమలు చేశారా..? అని ప్రశ్నించారు. కులగణన కోసం ఇండ్లకు వెళ్తున్న అధికారులను ప్రజలు నిలదీస్తున్నారు. యూపీఏ హయాంలో కనీసం ఓబీసీ మంత్రిత్వశాఖ కూడా పెట్టలేదన్నారు.
గతంలో ఉన్న హామీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. సరిగ్గా ఏడాది కిందట కామారెడ్డిలో ఇదే రోజు బీసీ డిక్లరేషన్ ను ప్రకటించిందని గుర్తు చేశారు. బీసీ డిక్లరేషన్ లో చెప్పిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. ఎంబీసీకి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వనందుకు సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్.