బీసీలకు వెన్నుపోటు పొడించింది కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్తవి అమలు చేయడం దేవుడెరుగు.. ఉన్నవి కూడా తీసేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. 42 శాతం రిజర్వేషన్లను బీసీలకు ఇచ్చిన తరువాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెల్లాలి. దళిత బంధు, బీసీ బంధు తో పాటు రైతుబంధు కు కూడా రాం రాం ప్రకటించి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.
యూపీఏ హయాంలో కనీసం ఓబీసీ మంత్రిత్వశాఖ కూడా పెట్టలేదన్నారు. బీసీ డిక్లరేషన్ హామీలు ఒక్కటైనా అమలు చేశారా..? అని ప్రశ్నించారు. కులగణన కోసం ఇండ్లకు వెళ్తున్న అధికారులను ప్రజలు నిలదీస్తున్నారు. బీసీ ఓట్ల కోసమే కులగణన డ్రామా అన్నారు. కులగణన అంటున్నావు.. కానీ రిజర్వేషన్ల గురించి మాత్రం మాట మాట్లాడటం లేదన్నారు. ఇంట్లో టీవీ, ప్రిడ్జ్ ఉందా..? సర్వేలో అడగడమేంటి అని ప్రశ్నించారు కేటీఆర్. రాష్ట్రాల్లో బీసీల మంత్రిత్వ శాఖ ఉన్నప్పుడు.. కేంద్రంలో ఎందుకు పెట్టలేదన్నారు. ఏడాది కిందట ఇదే రోజు బీసీ డిక్లరేషన్ ప్రకటించినట్టు తెలిపారు.