జల వివాదం… కేంద్రం సంచలన నిర్ణయం

-

జల వివాదం ( Water Dispute ) : తెలుగు రాష్ట్రాల్లో తరచూ జల వివాదం తలెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులు కృష్ణా, గోదావరి బోర్డుల ఆధీనంలోకి వెళ్లనున్నాయని, ఇక అన్ని ప్రాజెక్టులను బోర్డులే చూసుకుంటాయని కేంద్రం తెలిపింది. ఈ మేరకు గురువారం రాత్రి కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ సహా అన్నింటి నిర్వహణను ఇక నుంచి బోర్డులే చూసుకుంటాయి.

 

 water dispute | జల వివాదం
water dispute | జల వివాదం

అక్టోబరు 14 నుంచి ఇది అమల్లోకి వస్తుందని కేంద్ర జల్‌శక్తి శాఖ పేర్కొంది. ఈ నిర్ణయంతో కృష్ణా నదిపై ఉన్న 36, గోదావరిపై ఉన్న 71 ప్రాజెక్టులు రెండు బోర్డుల పరిధుల్లోకి వెళ్లనున్నాయి. బోర్డుల నిర్వహణ వ్యయాన్ని రెండు రాష్ట్రాలూ భరించాలి. ఒక్కో రాష్ట్రం ఒక్కో బోర్డుకు రూ. 200 కోట్ల చొప్పున 60 రోజుల్లో సీడ్‌ మనీ కింద డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. అలానే నిర్వహణ ఖర్చుల్ని కూడా అడిగిన 15 రోజుల్లోపు చెల్లించాల్సి ఉంటుంది.

అనుమతిలేని ప్రాజెక్టులపై కూడా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తాజా నోటిఫికేషన్‌ అమల్లోకి వచ్చిన తర్వాత 6 నెలల్లోపు అనుమతిలేని ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చుకోవాలని.. ఒకవేళ అనుమతులు పొందడంలో విఫలమైతే ప్రాజెక్టులు పూర్తయినా వాటిని నిలిపివేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రాజెక్టుల నుంచి నీళ్లు, విద్యుదుత్పత్తిని బోర్డే పర్యవేక్షిస్తుంది. బోర్డుల్లోని ప్రాజెక్టులు కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఉంటాయి. బోర్డు ఛైర్మన్‌, సభ్య కార్యదర్శి, చీఫ్‌ ఇంజినీర్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు సంబంధించిన వారు ఉండకూడదని కేంద్రం తన గెజిట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news