ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త.. ఆరోగ్య మిత్ర పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. గుంటూరు జిల్లాలోని డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్‌లో ఆరోగ్య మిత్ర (Arogya Mitra) , టీమ్ లీడర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

 

మొత్తం 34 ఖాళీలున్నాయి. దీని కోసం అప్లై చేయడానికి 2021 జూన్ 9 చివరి తేదీ. https://guntur.ap.gov.in/ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలని తెలుసుకో వచ్చు. ఇక పోస్టులు వివరాల లోకి వెళితే… మొత్తం ఖాళీలు- 34, ఆరోగ్య మిత్ర- 27, టీమ్ లీడర్- 4, డేటా ఎంట్రీ ఆపరేటర్- 3 వున్నాయి.

ఇక అర్హతల విషయం లోకి వస్తే… ఆరోగ్య మిత్ర, టీమ్ లీడర్ పోస్టులకు బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, డీ ఫార్మసీ, బీఎస్‌సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. టీమ్ లీడర్ పోస్టుకు అయితే రెండేళ్ల అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

అదే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు కంప్యూటర్స్‌లో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ కావాలి. పీజీడీసీఏ, సీఏడీ, ఇతర కంప్యూటర్ కోర్స్ పాస్ కావాలి. ఇక ఎంత జీతం వస్తుందంటే.. ఆరోగ్య మిత్ర పోస్టుకు రూ.12,000, టీమ్ లీడర్ పోస్టుకు రూ.15,000, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు రూ.15,000 వస్తాయి.

https://guntur.ap.gov.in/ ఓపెన్ చేసి.. దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేయాలి. దరఖాస్తు ఫామ్‌ను పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ అడ్రస్‌కు పంపాలి. Aarogyasri District Coordinator Office,
Guntur: A/26, Type-4, R&B Quarters, Beside DMHO Office, Collector Bunglow Road,
Guntur-522004.