NEET, NET వివాదాలపై కేంద్రం కీలక నిర్ణయం..!

-

NEET పేపర్ లీక్ అయిందని దేశవ్యాప్తంగా ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. NEET, NET పరీక్షలపై చోటు చేసుకున్న అక్రమాలు పేపర్ లీక్ ల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణ ప్రక్రియలో సంస్కరణ కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఏడుగురు సభ్యులుండే ఈ కమిటీకి ఇస్రో మాజీ చీఫ్ కె. రాధాకృష్ణన్ నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీలో ఎయిమ్స్ ఢిల్లీ మాజీ-డైరెక్టర్ డా. రణ్ దీప్ గులేరియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ బి.జె.రావు, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ కె.రామమూర్తి, కర్మయోగి భారత్ సహ వ్యవస్థాపకుడు పంకజ్ బన్సల్, ఐఐటీ ఢిల్లీ డీన్  ప్రొఫెసర్ ఆదిత్య మిత్తల్, కేంద్ర విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ గోవింద్ జైశ్వాల్ సభ్యులుగా ఉన్నారు.

ప్రవేశపరీక్షల నిర్వహణ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండటం కోసం ఈ కమిటీని ఏర్పాటుచేసినట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరును మెరుగుపరిచే మార్గాలను పరిశీలించేందుకే కమిటీ ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు పరీక్షల నిర్వహణ విధానంలో సంస్కరణలు, డేటా సెక్యూరిటీ ప్రొటోకాల్స్లో పురోగతి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరుపై ఈ కమిటీ తగిన సిఫార్సులు చేయనుంది. రెండు నెలల్లోగా ఈ కమిటీ తన నివేదికను సమర్పిస్తుందని కేంద్రం తెలిపింది. మరోవైపు, పేపర్ల లీకేజ్ లు అరికట్టేందుకు ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. దాని ప్రకారం చట్టవిరుద్ధంగా పరీక్ష రేపర్ లీక్ లు చేసినా నేరంగా పరిగణిస్తారు. దోషులకు 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.కోటీ వరకు జరిమానా విధించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news