ఎమ్మెల్సీ ఎన్నికల వేళ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన

-

తెలంగాణలో బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగిన కాంగ్రెస్ కు వ్యతిరేకంగానే ప్రజలు తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగిందని, ప్రజలంతా బీజేపీ వైపే చూస్తున్నారన్నారు. శనివారం యాదాద్రి బైపాస్ రోడ్ లోని హోటల్ వివేరాలో జరిగిన ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సన్నాహక సమావేశానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతోనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ పార్టీలో ఉండే పరిస్థితి లేదని, గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కేసీఆర్ ఏ విధంగా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కుటుంబ పాలనను చూసి ప్రజలు అస్యహించుకున్నారని అందువల్లే బీఆర్ఎస్ ను ప్రజలు ఓడించారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news